Sri Naradapuranam-3    Chapters    Last Page

మోహిన్యువాచ -



అహో ద్విజవరాఖ్యాతం గంగాద్వారసముద్భవమ్‌ | మాహాత్మ్య మధునా బ్రూహి బదర్యాః పాపనాశనమ్‌ 1
మోహిని పలికెను - ఓ బ్రాహ్మణోత్తమా! గంగాద్వార మాహాత్మ్యమును చెప్పితిరి. ఇక ఇపుడు పాపనాశకమగు బదరీ మహాత్మ్యమును తెలుపుము.
వసురువాచ : -
శృణు భ##ద్రే ప్రవక్ష్యామి మాహాత్మ్యం బదరీ భవమ్‌ | యచ్ఛ్రుత్వా ముచ్యతే జంతు ర్జన్మ సంసార బంధనాత్‌ 2
బదర్యాఖ్యం హరేఃక్షేత్రం సర్వపాతక నాశనమ్‌ | ముక్తిదం భవ భీతానాం కలిదోషహరం నృణామ్‌ 3
యత్ర నారాయణో దేవో నరశ్చ భగవానృషిః | ధర్మాన్మూర్త్యాం లబ్దజనీ యయతు ర్గన్థ మాదనమ్‌ 4
యత్రాస్తి బదరీ వక్షో బహుగంధ ఫలాన్వితః | తస్మిన్థ్సానే మహాభాగ ఆకల్పాదాస్థితాతపః 5
నారదాద్యైర్మునివరైః కలాపగ్రామవాసిభిః | సిద్ధసంఘైః పరివృతా లోకానాస్థితయే స్థితా 6
యత్రాగ్ని తీర్థం విఖ్యాతం వర్తతే సర్వసిద్దిదమ్‌ | మహాపాతకినస్తత్ర స్నాత్వా శుధ్యన్తి పాతకాత్‌ 7
దుర్వర్ణం హాటకం యద్వ దగ్నౌ ధ్మాతం విశుద్ధ్యతి | తధాగ్ని తీర్థ ఆప్లుత్య దేహీ పాపైర్విముచ్యతే 8
చాంద్రాయణ సహసై#్రస్తు కృచ్ఛ్రైః కోటిభిరేవ చ | యత్ఫలం లభ##తే మర్త్య స్తత్స్నానాద్వహ్ని తీర్థతః 9
శిలాః పంచాపి తత్తీర్దే సన్తి యన్మధ్యత స్థ్సితమ్‌ | అగ్ని తీర్థం విధిసుతే దర్శనాత్తద ఘాపహమ్‌ 10
నారదో యత్ర భగవాం స్తప స్తేపే సుదారుణమ్‌ | సా శిలా నారదీ నామ దర్శనాదేవ ముక్తిదా 11
నిత్యదా యత్ర సాన్నిధ్యం హరేరస్తి సులోచనే | తత్ర నారదకుండం చ యత్ర స్నాతో నరశ్శుచిః 12
భుక్తిం ముక్తిం హరే ర్భక్తిం యద్యద్వాంఛేత్తు తల్లభేత్‌ | ఏతస్యాం యో నరో భక్త్యా స్నానం దానం సురార్చనమ్‌ 13

హోమం జపం తధా
%న్యద్వా యత్కరోతి తదక్షయమ్‌ | వైనతేయ శిలాచాన్యా తస్మిన్‌ క్షేత్రే శుభావహా 14
యత్ర తప్తం తపస్తీవ్రం గురుదేవ మహాత్మనా | త్రింశద్వర్ష సహస్రాణి హరిదర్శనకామ్యయమా 15
తతః ప్రసన్నో భగవా స్దదౌ తసై#్మ వరం శుభే | అజేయో దైత్యసంఘానాం నాగానాం చ విభీషణః 16
వాహనం భవ మే వత్స ప్రసన్నోహం తవోపరి | త్వన్నామ్నేయం శిలా ఖ్యాతిం గమిష్యతి మహీతలే 17
దర్శనాత్పుణ్యదా నౄణాం యత్ర తప్తం త్వయా తపః | ఆత్ర ముఖ్యతమే గంగా తీర్థే మత్ర్పీతికామ్యయా 18
ఆవిరస్తు మహాభాగ పుణ్యదా స్నానకారిణామ్‌ | పంచగంగే తు యస్స్నాత్వా దేవాదీం స్తర్పయిష్యతి 19
న తస్య పునరావృత్తి ర్బ్రహ్మలోకాత్సనాతనాత్‌ | ఏవం దత్వా వరం విష్ణు ర్బభూవాంతర్హితస్తదా 20
గరుడో ప్యాజ్ఞయా విష్ణో ర్వామనత్వము పాగతః | తతః ప్రభృతి తత్తీర్ధం జాతం పాపవినాశనమ్‌ 21
పుణ్యదం వై స్మరేచ్చాపి వైనతేయ గతిప్రదమ్‌ | అధాన్యాతు శిలా తత్ర వారాహీతి శుభావహా 22
యత్రోద్దృత్య మహీం దేవో హిరణ్యాక్షం నిపాత్య చ | శిలారూపేణ చాక్రమ్య స్థితః పాపవినాశనః 23
తత్ర యో మనుజో గత్వా గంగాంభస్యమలే ప్లుతః | పూజయేత్తాం శిలాం భక్త్యా స న దుర్గతి మాప్నుయాత్‌ 24
వసువు పలికెను. భద్రురాలా ఇపుడు బదరీమాహాత్మ్యమును చెప్పెదను. వినుము ఈ మాహాత్మ్యమును వినినచో మానవుడు జన్మ సంపార బంధము నుండి విముక్తుడగును. బదరియను శ్రీహరి క్షేత్రము సర్వపాతక నాశనము. సంసార భీతులకు కలి దోషహరము. మోక్షప్రదము ధర్ముని నుండి మూర్తి యందు జన్మించిన నరనాయణులు గంధమాదనమునకు వెళ్ళిరి. ఇచటనే బహుగంధ ఫలాన్వితమగు బదరీ వృక్షమును స్థానమున కల్పాది నుండి తపస్సు చేయుచుండిరి. ఇచట వీరు గ్రామవాసులగు నారదాది మునివరులచే, సిద్ధసంఘములచే పరివృతులై లోకస్థితి కొరకు తపమును చేయుచుండిరి. ఇచటనే సర్వసిద్ధి ప్రదమగు అగ్నితీర్థము కలదు. మహాపాతకులు కూడా ఇచ్చట స్నానమాడి పాతకములనుండి విముక్తులగుదురు. కలుషితమైన బంగారము అగ్నిలో దహించబడిన బంగారము శుద్ధి పొందినట్లు అగ్నితీర్థమున స్నానమాడిన నరుడు పాప విముక్తుడగును. వేల చాంద్రాయణ వ్రతములచే కోటికృచ్ఛ్ర వ్రతములచే పొందబడు ఫలము అగ్నీ తీర్థ స్నానము వలన లభించును. ఇచట అయిదు శిలలు కలవు. ఈ శిలలమధ్యలో అగ్నీ తీర్థము కలదు. అగ్ని తీర్థ దర్శన మాత్రముననే సర్వ పాతకములు నశించును. నారద మహర్షి ఘోర తపము నాచరించిన శిల నారదీ శిల యనబడును. నారదీ శిలా సందర్శముననే ముక్తిని ప్రసాదించును. ఇచటనే నారద కుండము కలదు. ఇచటనే స్నానమాడిన నరుడు పరిశుద్ధుడగును. భుక్తిని ముక్తిని శ్రీహరి భక్తిని సకలాభీష్టములను పొందును. ఈ కుండమునందు చేయబడు స్నానము దానము సురార్చనము హోమము, జపము, ఇతర పుణ్యకార్యములు అక్షయమగును. ఈ క్షేత్రముననే మరొయొకటి శుభావహమగు వైనతేయ శిలక కలదు. ఇచటనే గరుడుడు మహాతపమును శ్రీహరి ధర్శనము కొరకు ముప్పది వేల సంవత్సరములు చేసెను. అంతట ప్రసన్నుడగు శ్రీహరి దైత్యనాగులను అజేయునిగా, భయంకరునిగా వరమునిచ్చి తనకు వాహనముగా చేసుకొనెను. ఈశిలకూడా నా పేరుతోనే ప్రసిద్ధి పొందును. దర్శన మాత్రముననే నరులకు పుణ్యమును కలిగించును. ఇచట నాప్రీతి కొరకు గంగాతీర్థము ఆవిర్భవించెను. స్నానము చేయువారికి పుణ్యమునిచ్చును. పంచగంగలో స్నానమాడి దేవాదులకు తర్పణములనిచ్చిన వారు సనాతనమగు బ్రహ్మలోకము నుండి మరల తిరిగిరారు. ఇట్లు వరములనిచ్చి శ్రీహరి అంతర్ధానము నందెను. గరుడుడు కూడ శ్రీహరి ఆజ్ఞచే శ్రీహరి వాహనమాయెను. అప్పటినుండి ఈ తీర్థము పాపనాశనమాయెను. స్మరణ మాత్రముననే పుణ్యప్రదము. వైనతేయగతి ప్రదము. ఇచటనే మరియొక శిలవారాహి అని కలదు. ఇచటనే శ్రీహరి హిరణ్యాక్షుని వధించి మహిని ఉద్ధరించి శిలారూపముచే ఆక్రమించి యుండెను. పాపనాశకమగు ఈ శిలపై యున్న గంగాజలమున స్నానమాడి భక్తితో ఈశిలను పూజించిన వారు దుర్గతిని పొందజాలరు.
అధాన్యా నారసింహాఖ్యా శిలా తత్ర పురేశ్వ | హిరణ్యకశిపుం హత్వా స్థితో యత్ర బభూవ హ 25
తతస్సురరిభిస్సర్వైః క్రోధస్తస్య నివారితః | ప్రార్థితశ్చ విశాలాయాం స్థాతుం తత్ర సదైవ హి 26
చతుర్భుజస్తథా తత్ర శిలారూప ము పాగతః | జలక్రీడాపరోనిత్యం వర్తతే తోయ మధ్యగః 27
తత్ర య స్స్నాతి మనుజో నృహరేః పూజయే చ్ఛిలామ్‌ | స లభే ద్వైష్ణవం ధామ పునరావృత్తి దుర్లభమ్‌ 28
పంచమీ తు శిలాం దేవి వహ్నికుండతటస్థితామ్‌ | నరనారాయణాభ్యాం చ వక్ష్యామి శృణు సాంప్రతమ్‌ 29
కృతే యుగే తు సర్వేషాం నరనారాయణో హరిః | ప్రత్యక్షం వసతే తత్ర భుక్తి ముక్తి ప్రదాయకః 30
త్రేతాయాం మునిభిర్దేవై ర్యోగిభిర్ధృశ్యతే శుభే | నాన్యై స్సమాస్థితో యోగం లోకస్థితి విధాయకః 31

ద్వాపరే సమనుప్రాప్తే జ్ఞానయోగేన దృశ్యతే | నాన్యోపాయేన కేనాపి తిష్యే
%దర్శనతాం గతః 32
తతో బ్రహ్మదయో దేవా ఋషయశ్చ త పోధనాః | స్తుత్వా వాగ్భిర్విచిత్రాభి ర్దేవం ప్రాసాదయ న్హరిమ్‌ 33

తతో
% శరీరిణీ వాణీ ప్రాహ తాన్విధి పూర్వకాన్‌ | కలౌ న దర్శనం యామి సర్వధర్మ వివర్జితే 34
యది వో దర్శనే శ్రద్ధా మండపస్య సురేశ్వరాః | గృహీధ్వం మామకీం మూర్తి శైలీం నారద కుండగామ్‌ 35
తతస్తాం గిర మాకర్ణ్య బ్రహ్మాద్యా హృష్టమానసాః | నిష్ర్కామ్య శైలాం తాం దివ్యాం మూర్తిం నారదకుండగామ్‌ 35
స్థాపయామాసురభ్యర్చ్య స్వం స్వం ధామ యయు స్తతః | వైశాఖే మాసి తే దేవా గచ్ఛన్తి నిజమందిరమ్‌ 37
కార్తికే తు సమాగత్య పునరర్బాం చరన్తి చ | తతో వైశాఖమారభ్య మానవా హిమసంక్షయాత్‌ 38
లభ##న్తే దర్శనం పుణ్యాః పాపకర్మవివర్జితాః | షణ్మాసం దైవతైః పూజ్యా షణ్మాసం మానవైస్తథా 39
ఏవం వ్యవస్థయా మూర్తి స్తత్ర్పభృత్యావిరాస సా | యశ్శైలీం ప్రతిమాం విష్ణోః పూజయేద్భక్తి భావతః 40
నైవేద్యం భక్షయేచ్ఛాపి స ముక్తిం లభ##తే ధ్రువమ్‌ | ఏతాః పంచశిలాః పుణ్యాః విశాలాయాం వ్యవస్థితాః 41
ఆసాం మధ్యేతు నైవేద్యం దేవానా దుర్లభం హరేః | కిం పునర్మానుషాదీనాం భక్షితం మోక్షసాధనమ్‌ 42
బదర్యాం విష్ణునైవేద్యం సిక్థమాత్రం చ భక్షితమ్‌ | శోధయే ద్దేహగం పాపం దీప్తాగ్నిరివ కాంచనమ్‌ 43
కపాలమోచనం హ్యేత త్తీర్ధం పాప విశోధనమ్‌ | యన్మధ్యేతు శిలాః పంచ సంతి పాప విమోచికాః 44
అధాపరం మహత్తీర్ధం తత్రైవ శృణు మోహిని | యత్ర స్నాతో నరో భక్త్యా వేదానాం పారగో భ##వేత్‌ 45

సుప్తస్య బ్రహ్మణో వక్త్రా న్నిర్గతానసురో
%హరత్‌ | వేదాన్హయ శిరా నామ దేవాదీనాం భయావహాః 46
తతస్తు బ్రహ్మణా విష్ణుః ప్రార్థితః ప్రకటో
%భవత్‌ | మత్స్య రూపేణ తం హత్వా వేదాన్న్పత్యర్ప్యయద్విధేః 47
తచ్చతీర్థం మహత్పుణ్యం సర్వవిద్యాప్రకాశకమ్‌ | తైమింగిలం మహాభాగే దర్శనాత్పాపనాశనమ్‌ 48
హయగ్రీవ స్వరూపేణ భగవాన్విష్ణురవ్యయః | పునశ్చ చ హత్వా మత్తౌ ద్వా వసురౌ మధుకైటభౌ 49
వేదా పహారిణౌ భూయో వేదాన్వై బ్రహ్మణ హ్యదాత్‌ | తత్తీర్థం సర్వపాపఘ్నం స్నానమాత్రేణ వైధసి 50
మాత్స్యే చాపి హయగ్రీవే వేదాస్తేద్రవరూపిణః | వర్తన్తే సర్వదా భ##ద్రే తజ్జలం పాపనాశనమ్‌ 51
ఇచటనే మరియొక శిల నారసింహశిల కలదు. ఇచటనే నరసింహ స్వామి హిరణ్య కశ్యపుని సంహరించి నిలిచెను. దేవర్షులందరూ కలిసి స్వామి కోపమును నివారించిరి. ఈ విశాల శిలయందుండుటకు ప్రార్ధించిరి. అపుడు అచట చతుర్భుజునిగా శిలారూపముగా నిలిచెను. నిత్యము జలక్రీడాపరుడై నీటి మధ్యలో నుండును. ఇచట స్నానమాడి నారసింహశిలను భక్తిచే పూజించు వాడు పునరావృత్తి రహితమగు శ్రీహరి లోకమును పొందును. ఇక ఇపుడు అయిదవదగు నరనారాయణాఖ్యమగు శిలను గూర్చి చెప్పెదను. కృతయుగమున ఈశిలయందు నరనారాయణ రూపుడగు శ్రీహరి ప్రత్యక్షముగా కుండెను త్రేతాయుగమున మునులను దేవతలను యోగులకు మాత్రముకనపడు చుండెను. యోగమును లోకస్థితి కొరకు వహించి ఇతరులను కనబడెడివాడు కాడు. ద్వాపరయుగమున ఒక జ్ఞానయోగమున మాత్రమే కనబడెడివాడు. కలియుగమున అదృశ్యుడాయెను. అపుడు బ్రహ్మాది దేవతలు ఋషులు శ్రీహరిని ప్రార్థించిరి. అపుడు అశరీరవాణి బ్రహ్మాదులతో సర్వధర్మ వివర్జితమగు కలియుగమున దృశ్యుడనుకాను. మీరు దర్పించవలయునన్న కోరిక కలదేని నారద కుండమున గల మండపమున నున్న నామూర్తిని స్వీకరించుడు. అంతట బ్రహ్మాదులా మాటలను విని సంతుష్ట మనస్కులై అటనుండి బయలు దేరి నారదకుండముననున్న ఆ శిలను పూజించి స్థాపించిరి. తరువాత తమ తమ నివాసముల కరిగిరి. వైశాఖ మాసమున ఆ దేవతలు తమ గృహములకు వెళ్ళెదరు. కార్తికమున వచ్చి మరల అర్చింతురు వైశాఖ మాసమునుండి మంచు తగ్గును. కావున పవిత్రులగు మానవులు మూర్తి దర్శనమును పొందెదరు. పాప విముక్తులగుదురు. ఇట్లు ఇచట మూర్తి దర్శనమును పొందెదరు. పాప విముక్తులగుదురు. ఇట్లు ఇచట మూర్తిని ఆరు మాసములు దేవతలు పూజింతురు. ఆరుమాసములు మానవులు పూజింతురు. అప్పటి నుండి ఈ వ్యవస్థతో అచట నరనారాయణ మూర్తి ఆవిర్భవించెను. ఇచట శ్రీమహావిష్ణువు శిలా ప్రతిమను భక్తి భావముచే పూజించు వారు, నైవేద్యమును భుజించువారు తప్పక ముక్తిని పొందెదరు. ఈ పవిత్రములగు అయిదు శిలలు విశాలయందు కలవు ఈ శిలా మధ్యమున శ్రీహరి నైవేద్యము దేవతలకు కూడా దుర్లభము. ఇక మనుషుల విషయము ఏమి చెప్పవలయును. భుజించిన వారు మోక్షమును పొందెదరు. బదరియందు ఒక చిటికెడు విష్ణునైవేద్యమును భుజించినచో అగ్ని బంగారమును శుద్ధి పరచునట్లు దేహగత పాపములను శుద్ధి పరచును. ఇచటనే కపాల మోచనమను తీర్థము సర్వపాపవిశోధనము. ఇచటనే పాప విమోచనములగు అయిదు శిలలు కలవు. ఇచటనే మరియొక మహాతీర్థము కలదు. ఇచట స్నానమును చేసిన వారు వేద పారంగతులగుదురు. నిదురించిన బ్రహ్మవక్త్రము నుండి బయలు వెడలిన వేదంములను దేవ భయంకరుడగు హయగ్రీవుడను రాక్షసుడుపహరించెను. అంతట బ్రహ్మ శ్రీహరిని ప్రార్థించెను. శ్రీహరి ప్రత్యక్షమై మత్స్యరూపముతో హయగ్రీవుని సంహరించి తిరిగి వేదముల నర్పించెను ఇచట వెలసిన ఈ తీర్థము మహాపుణ్యము. సర్వ విద్యాప్రకాశకము. ఇదియే తైమింగిలమను తీర్థము. దర్శన మాత్రముననే పాప నాశనము. మరల ఒకసారి అవ్యయుడగు శ్రీహరి హయగ్రీవ రూపముతో మదించి వేదములనపహరించిన మధుకైటభులను రాక్షసులని చంపి వేదములను బ్రహ్మకర్పించెను. ఈ హయగ్రీవ తీర్థము స్నానమాత్రముననే సర్వపాపహారము. మాత్స్య తీర్థమున,హయగ్రీవ తీర్థము స్నానమాత్రముననే సర్వపాపహారము. మత్స్య తీర్థమున, హాయగ్రీవ తీర్థమున వేదములు ద్రవరూపముగా నుండును. కావున ఈ జలము పాపనాశకము.
తీర్థ మిన్ద్ర పదం తత్ర విఖ్యాతం వహ్నికోణగమ్‌ | తత్ర స్నాత్వా నరో దేవి పదమైన్ద్ర మవాప్నుయాత్‌ 52
మానసోద్భేదకం చాన్య త్తత్ర తీర్థం మనోరమమ్‌ | భినత్తి హృదయం గ్రంధి ఛినత్త్యఖిల సంశయమ్‌ 53
హరత్యంహశ్చ సకలం మానసోద్భేదకం తతః | కామా కామాభిధం చాన్య త్తీర్థం తత్ర వరాననే 54
కామప్రదం కామవతా మకామానాం తు మోక్షదమ్‌ | తతః పశ్చిమతో భ##ద్రే వసుధారేతి తీర్థకమ్‌ 55
తత్ర స్నాత్వా నరోభక్త్యా లభ##తే వాంఛితం ఫలమ్‌ | అత్ర పుణ్యవతో యాంతి దృశ్యతే జల మధ్యగమ్‌ 56
యద్దృష్ట్వా న పునర్జన్తు ర్గర్భవాసం ప్రపద్యతే | తతో నైఋతి దిగ్భాగే పంచధారాః పతన్త్యథః 57
ప్రభాస పుష్కరగ నైమిషారణ్య సంజ్ఞకాః | తాసు స్నాత్వా పృథజ్మర్త్య స్తత్తతీర్థ ఫలం లభేత్‌ 58

తతో
%న్యద్విమలం తీర్థం సోమకుండాపరాహ్వయమ్‌ | యత్ర తప్త్యా తపస్త్రీవం సోమః ఖేటాద్యధీశ్వరః 59
తత్ర స్నాత్వా నరో భ##ద్రే గత దోషః ప్రజాయతే | తత్రాన్యద్ద్వాదశాదిత్యం తీర్థం పాపహరం పరమ్‌ 60
స్నాత్వా యత్రనరో భూత్వా తేజసా భాస్కరోపమః | చతుస్స్రోతోపరం తత్ర తీర్థం తత్రాప్లుతో నరః 61
ధర్మార్థ కామమోక్షాంశ్చ లభ##తే యం యమిచ్ఛతి | అధ సప్తపదం నామ తీర్థం తత్ర మనోహరమ్‌ 62
దర్శనాద్యస్య తీర్థస్య పాతకాని మహాన్త్యపి | నశ్యంతి నియతం తస్య కిం పున స్స్నానతస్సతి 63
త్రిషు లోకేషు కుండస్య బ్రహ్మవిష్ణు మహేశ్వరాః | అస్థితాస్తత్రమరణా న్నరస్సత్య పదం లభేత్‌ 64
నరనారయణావాపే తీర్థ మస్త్యపరం శుభే | ఊర్వశీకుండనామాత్ర స్నాతో రూపమనోహరః 65

నారాయణ ప్రియో
%త్యర్థం భ##వేద్విశ్వవశంకరః | తతో దక్షిణ దిగ్భాగే తీర్థ మస్త్రాభిధం పరమ్‌ 66
నరనారాయణ యత్ర శస్త్రం న్యస్య తపస్థితా | ఆయుధాని తు దివ్యాని శంఖ చక్రాది కాని చ 67
మూర్తిమన్తి మహాభాగే దృశ్యంతే కృతిభిర్యతః | తత్ర స్నాత్వా నరో భక్త్యా న శత్రోర్భయ మాప్నుయాత్‌ 68
మేరు తీర్థం చ తత్రాస్తి యత్ర దృష్ట్వా ధనుర్థరమ్‌ | స్నాత్వా చ లభ##తే సోయం శుభే సర్వాన్మపనోరధాన్‌ 69
లోకపాలాహ్వయం నామ తత్రాన్యత్తీర్థ ముత్తమమ్‌ | లోకపాలై స్తపస్తప్తం యత్ర తత్రాప్లుతో నరః 70
సర్వతీర్థప్లుతి ఫలం లభ##తే దేవి మానవః | దండేనాహత్య హరిణా యతస్తీర్థం వినిర్మితమ్‌ 71
దండపుష్కరిణీత్యేత త్తతో లోక ప్రసౌఖ్యదమ్‌ | భాగీరధీ యత్ర యోగం ప్రాప్తాహ్యలకనందయా 72
తత్తీర్థం సర్వత శ్శ్రేష్‌ఠం పుణ్‌యే బదరి కాశ్రమే | తత్ర స్నాత్వా పితౄన్దేవా న్సంతర్య్యాభ్యర్చ్య భక్తితః 73
లభ##తే వైష్ణవం ధామ సర్వదేవ నమస్కృతః | సంగమాద్దక్షిణ భాగే ధర్మక్షేత్రం శుభాననే 74
తత్‌క్షేత్రం పావనం మన్యే సర్వతీర్థోత్తమోత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో భ##ద్రే సాధ్యసన్నిధి భాగ్భవేత్‌ 75
ఉర్వశీ సంగమం తీర్థం సర్వపాపహరం నృణామ్‌ | కర్మోద్దరాహ్వయం చాన్య ద్దరిభ##క్త్యేక సాధనమ్‌ 76
బ్రహ్మావర్తా హ్వయం తీర్థం బ్రహ్మలోకైకకారణమ్‌ | గంగాశ్రితాని చైతాని తీర్థాని కధితాని తే 77

బ్రహ్మాపి కా
ర్‌త్స్న్య తో వక్తుం తత్ర స్థాన్యనలం ప్రభుః | య ఇదం శృణుయాన్నిత్యం శ్రావయే ద్వా స సమాహితః 78
సర్వపాప వినిర్ముక్త స్సో
%పి విష్ణుపదం లబేత్‌ | మాసమాత్రం నరో భక్త్యా యో%త్ర తిష్ఠేద్ధృత వ్రతః 79
సపాక్షాదేవ పశ్యేత్తు నరనారాయణ హరిమ్‌ | యత్రైతల్లిఖితం దేవి మాహాత్మ్యం బదరీ భవమ్‌ 80
నాల్పమృత్యుర్భవేత్తత్ర హ్యాధి వ్యాధ్యహి భీస్తదా | కళ్యాణాని సదా తత్ర ప్రసాదాత్సంతి వై హరేః 81
వర్ధన్తే సంపదస్సర్వా స్తధా విష్ణు ప్రసాదతః 82
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే బృహదుపాఖ్యానే
వసు మోహినీ సంవాదే బదరి కాశ్రమ మాహాత్మ్యం నామ సప్త షష్టి తమో
%ధ్యాయః
ఇచటనే ఆగ్నేయ కోణమున ఇంద్ర పదమను తీర్థము సుప్రసిద్ధము. ఇచట స్నానమాడినవాడు ఇన్ద్రలోకమును పొందును. ఇచటనే మనోహరమగు మాన సోద్భేదకమను తీర్థము కలదు. హృదయ గ్రంధిని భేదించును. అఖిల సంశయములను భేదించును. సకల పాపములను హరించును. అందువలననే ఇది మానసోద్భేదము. ఇచటనే మరియొకటి కామకామతీర్థము కలదు. కోరికలు కల వారికి కోరికలను తీర్చును. కోరికలు లేనివారికి మోక్షమును ప్రసాదించును. ఇచటికి పశ్చిమమున వసుధారా తీర్థము కలదు. ఇచట భక్తితో స్నానమాడిన వారు వాంఛితఫలమునుపొందెదరు. ఇచట పుణ్యాత్ములు మాత్రమే జలమధ్యగతమును చూడగలుగుదురు. ఈ దర్శనముతో ప్రాణి మరల గర్భ వాసదుఃఖమును పొందజాలరు. ఇటకు నై
తి దిగ్భాగమున క్రింద అయిదు ధారలు పడుచుండును. ప్రభాస, పుష్కర, గయానైమిషారణ్య సంజ్ఞలు కలవి, విడివిడిగా ఈ తీర్థములలో స్నానమాడిన వారు ఆయా తీర్థముల ఫలములను పొందెదరు. తరువాత సోమకుండమని మరియొక పేరుకల విమలతీర్థము కలదు. ఇచట తీవ్రమగు తపము నాచరించి చంద్రుడు నక్షత్రాధిపతి ఆయెను. ఇచట స్నానము చేసిన వారు దోషరహితులగుదురు. ఇచటనే మరియొకటి పాపహరమగు ద్వాదశాదిత్య తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు సూర్య సన్నిభ##తేజస్కులగుదురు. ఇచటనే గల చతుస్స్రోతతీర్థమున స్నానమాడిన వారు ధర్మార్థ కామ మోక్షములలో కోరిన వాటిని పొందగలరు. ఇచటనేయున్న సప్త పదమను మనోహర తీర్థమును దర్శించుట తోడనే మహాపాతకములు కూడా నశించుననగా ఇక స్నానము చేసిన ఏమి చెప్పవలయును? ఇచటనే లోకత్రయ ప్రసిద్ధమగు బ్రహ్మ విష్ణు, మహేశ్వర కుండము కలదు. ఇచట మరణించిన వారు సత్య పదమును పొందెదరు. నర నరాయణ క్షేత్రమున ఊర్వశీకుండమను మరియొకటి తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు రూపవంతులగుదురు. నర నారాయణ ప్రియులు విశ్వవశంకరులు అయ్యెదరు. ఇచటికి దక్షిణ దిగ్భాగమున అస్త్ర తీర్థము కలదు. ఇచటనే నర నారాయణులు శస్త్రములనుంచి తపస్సును చేయు చుండిరి. ఇచట దివ్యములగు శంఖ చక్రగదా ద్యాయుధములు ఆకారమును ధరించి పుణ్యాత్ములకు కనపడును. ఇచట స్నానమాడిన వారికి శత్రుభయము కలుగదు. ఇచటనే మేరు తీర్థము కలదు. ఇచట స్నానమాడి ధనుర్థురుని చూచి సకలా భీష్టములను పొందును. ఇచటనే లోకపాల తీర్థము కలదు. ఇచటనే లోకపాలకులు తప మాచరించిరి. ఇచట స్నానమాడిన వారు సర్వతీర్థ స్నానఫలమును పొందెదరు. ఇచట శ్రీహరి దండముతో కొట్టి తీర్థమును నిర్మించెను. కావున దండపుష్కరిణియని పేరు పొంది లోకపాలులకు ఆనందమునిచ్చును. అలకనందతో భాగీరధి సంగమమును పొందినది. బదరికాశ్రమమున ఈ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము. ఇచట స్నానమాడి పితరులను దేవతలను ఋషులను చక్కగా పూజించి తర్పణములిడి సర్వదేవనమస్కృతుడై విష్ణులోకమును పొందును. ఈ సంగమమునకు దక్షిణ భాగమున ధర్మక్షేత్రము కలదు. ఈ తీర్థము పరమపావనము సర్వతీర్థోత్తమోత్తమము. ఇచట స్నానమాడిన వాడు సాధ్వసన్నిధిని చేరును. ఇచటనే సర్వపాపహరమగు ఉర్వశీ సంగమ తీర్థము కలదు. హరి భక్తిని చక్కగా కలిగించు కర్మోద్ధర తీర్థము కూడా కలదు. బ్రహ్మలోకమును పొందించు బ్రహ్మావర్త తీర్థము కలదు. ఈ తీర్థము లన్నియు గంగనాశ్రయించిన తీర్థములు. ఇచటనున్న అన్ని తీర్థములను బ్రహ్మా కూడా చెప్పజాలడు. ఈ బదరికాశ్రమ మాహాత్మ్యమును విననివారు వినిపించిన వారు సర్వపాప వినిర్ముక్తులై విష్ణులోకమును చేరెదరు. ఇచట వ్రతమును స్వీకరించి ఒక మాసము నివసించిన వాడు ప్రత్యక్షముగా నర నారాయణ రూపుడగు హరిని చూడ గలుగును ఈ బదరీ మాహాత్మ్యమును వ్రాసిన వారికి అకాలమృత్యవు కలుగదు. ఆధి వ్యాధి సర్పభయములు కలుగవు. శ్రీహరి అనుగ్రహము వలన సకల శుభములు సమకూరును. సకల సంపదలు వృద్ధి చెందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యనమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున బదరికాశ్రమ మాహాత్మ్యమను
అరువది యేడవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page